'వారం రోజుల్లో రైల్వేక్రాసింగ్‌ల వద్ద గేట్లు' | Rail gates to be installed with in a week at unprotected level crossings, says South Central Railway General Manager | Sakshi
Sakshi News home page

'వారం రోజుల్లో రైల్వేక్రాసింగ్‌ల వద్ద గేట్లు'

Jul 24 2014 3:34 PM | Updated on Oct 16 2018 3:12 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల్లోగా కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ గురువారం హైదరాబాద్లో వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల్లోగా కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేస్తామని దక్షిణ మధ్య రేల్వే జీఎం శ్రీవాత్సవ గురువారం హైదరాబాద్లో వెల్లడించారు. అంతకు ముందు మెదక్ జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్... జీ ఎం శ్రీవాత్సవతో మాట్లాడారు. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఈ సందర్బంగా శ్రీవాత్సవకు విజ్ఞప్తి చేశారు. దాంతో వారం రోజుల్లోగా రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేస్తామని శ్రీవాత్సవ తెలంగాణ సీఎం కేసీఆర్కు హమీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement