30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | ౩౦ quintals ration rice seized | Sakshi
Sakshi News home page

30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Oct 21 2015 5:50 PM | Updated on Sep 3 2017 11:18 AM

పేదలకు ఇవ్వవలసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

నాగులుప్పలపాడు: పేదలకు ఇవ్వవలసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.  ఒంగోలు జిల్లా నాగులుప్పలపాడు మండలం ఇడునుడి గ్రామంలో బుధవారం డీసీఎంలో 59 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు.

దీంతో స్థానికులు వాహనాన్ని అడ్డుకోవడంతో అక్రమార్కులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు సమాచారం అందించడంతో డీసీఎంను వదిలి అక్రమార్కులు పరారయ్యారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దీనిపై రెవిన్యూ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement