
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు రాజ్‌భవన్‌లో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పీవి సింధు మాట్లాడుతూ.. దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చేందుకు కృషి చేస్తానని, ప్రస్తుతం తనపై బాధ్యత మరింత పెరిగిందని స్పష్టం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ మాట్లాడుతూ..బ్యాడ్మింటన్‌లో సింధు ప్రపంచకప్ సాధించడం సంతోషంగా ఉందని, సింధును ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. కోచ్ గోపిచంద్ మంచి ఆటగాడని, తన శిష్యరికంలో ఇంకా అనేక మంది క్రీడాకారులను దేశానికి అందించాలని గవర్నర్ సూచించారు.