అనారోగ్యంతో ఖైదీ మృతి | Prisoner died in Ruia Hospital | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో ఖైదీ మృతి

May 22 2015 6:54 PM | Updated on Sep 3 2017 2:30 AM

ఓ హత్యకేసులో నెల్లూరు జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది.

తిరుపతి : ఓ హత్యకేసులో నెల్లూరు జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. అలిపిరి ఎస్‌ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని కాల్వాయ్ గ్రామంలో నివాసముండే ప్రభాకర్(36) నెల్లూరులో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో జీవితఖైదీగా శిక్ష అనుభిస్తున్నాడు. కాగా ఇతను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నయం కాకపోవడంతో శుక్రవారం తిరుపతిలో రుయాకు తీసుకువచ్చారు. రుయాలో చికిత్స పొందుతూ మధ్యాహ్న సమయంలో మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement