అభివృద్ధి పనులను అడ్డుకుంటారా..? | Prevents the development work | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులను అడ్డుకుంటారా..?

Jul 26 2015 11:39 PM | Updated on May 29 2018 4:23 PM

ప్రభుత్వం అభివృద్ధి ప నులు మంజూరు చేయకుం డా, తాను మంజూరు చే యించిన పనులను అడ్డుకుంటోందని సాలూరు ఎమ్మె ల్యే, వైఎస్‌ఆర్ సీపీ

 సాలూరు: ప్రభుత్వం అభివృద్ధి ప నులు మంజూరు చేయకుం డా, తాను మంజూరు చే యించిన పనులను అడ్డుకుంటోందని సాలూరు ఎమ్మె ల్యే, వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర మండిపడ్డారు. సోమవారం జరగాల్సిన తహశీల్దార్ కార్యాలయ భవన ప్రారంభోత్సవం వాయిదా పడడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందన్నారు. సాలూరులో *50లక్షలతో నిర్మించిన ఎస్సీ బాలికల హాస్టల్ నిర్మాణం పూర్తయినా ప్రారంభించడం లేదన్నారు. *3కోట్లతో నిర్మించిన యువజన శిక్షణ కేంద్రం ఏడాదిగా ప్రారంభానికి ఎదురు చూస్తోందన్నారు. ఏపీ సీడ్స్ గోదాముల పరిస్థితీ అంతేనని అన్నారు. పాంచాలి- గురువినాయుడుపేటల మధ్య, జీటీపేట వద్ద వంతెనల నిర్మాణాలను అడ్డుకుంటున్నారని అన్నారు. *33కోట్లతో పాచిపెంటలో రక్షిత పథకాన్ని చేపట్టినా పనులు పూర్తికావడం లేదని తెలిపారు. పేరు ఎవరిదైనా అభివృద్ధి పనులను పూర్తి చేస్తే చాలని, ప్రజలకు మేలు చేస్తే అంతే చాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement