కల్లబొల్లి మాటలు చెప్పి! | pregnancy case in amalapuram | Sakshi
Sakshi News home page

కల్లబొల్లి మాటలు చెప్పి!

Mar 30 2017 10:15 PM | Updated on Sep 5 2017 7:30 AM

కల్లబొల్లి మాటలు చెప్పి!

కల్లబొల్లి మాటలు చెప్పి!

అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కల్లబొల్లి కబుర్లు చెప్పి వెంట వచ్చేలా చేసుకున్నాడు. చివరకు ఆమెను గర్భవతిని చేసి పరారయ్యాడు.

యువతిని తల్లిని చేసి పరారైన యువకుడు
తూర్పు గోదావరి: అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కల్లబొల్లి కబుర్లు చెప్పి వెంట వచ్చేలా చేసుకున్నాడు. చివరకు ఆమెను గర్భవతిని చేసి పరారయ్యాడు. చివరికి ఆ అమాయకురాలు  మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏమైందని అడుగుతుంటే  ఓ కుర్రాడు వచ్చాడు. తర్వాత కనిపించకుండా వెళ్లిపోయాడని ఆమె పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకుని అమాయకంగా చెబుతోంది.  
 
అమలాపురం  మండలంలో మిక్చర్‌ కాలనీకి చెందిన 23 ఏళ్ల ఆమె  పట్టణంలో ఒక షాపులో పనిచేసేది. తండ్రి చనిపోయాడు తల్లి కూలి పనికి వెళుతుంది అక్కకు పెళ్లైంది. ఇద్దరు తమ్ముళ్లు వడ్రింగి మేస్త్రుల హెల్పర్లు  ఎనిమిది నెలల క్రితం భీమవరానికి చెందిన ఓ యువకుడు కూలీ పనికి అమలాపురం వచ్చాడు. ఆమెకు మాయ మాటలు లైంగికదాడి చేశాడు. ఆమె గర్భం దాల్చడంతో అతడు పరారయ్యాడు. ప్రభుత్వ ఏరియా ఆస్పతిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వచ్చి బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. ఆస్పత్రిలో బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని ఆమెకు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేస్తామని బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు దర్యాప్తు చేస్తామని సీఐ జి.దేవకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement