గంజాయి స్వాధీనం | Possession of marijuana | Sakshi
Sakshi News home page

గంజాయి స్వాధీనం

May 12 2016 4:41 AM | Updated on Sep 2 2018 3:46 PM

గంజాయి స్వాధీనం - Sakshi

గంజాయి స్వాధీనం

మండలంలోని ఎంకేపట్నం- బీబీపట్నం మార్గంలో గంజాయి వ్యాపారులపై పోలీసు లు నిర్వహించిన దాడుల్లో ఒక వ్యక్తి.....

ఒకరి అరెస్టు, పరారీలో మరొకరు

రోలుగుంట: మండలంలోని ఎంకేపట్నం- బీబీపట్నం మార్గంలో గంజాయి వ్యాపారులపై పోలీసు లు నిర్వహించిన దాడుల్లో ఒక వ్యక్తి పట్టుబడగా, మరో వ్యక్తి తప్పించుకున్నాడు. అతని నుంచి 88 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ గోవిందరావు కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. ఎంకేపట్నం- బీబీపట్నం మార్గంలో బుధవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పక్షుల చెరువువద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

అతని వద్ద బస్తాలను పరిశీలించగా గంజాయి బయటపడింది. అక్కడి ఉన్న బీబీపట్నం గ్రామానికి చెందిన విసారపు వెంకట్రావును పట్టుకోగా, మరో వ్యక్తి పరారైనట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న వ్యక్తికోసం పోలీసులు గాలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.76 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement