రాజకీయ ‘రచ్చ’బండ | Sakshi
Sakshi News home page

రాజకీయ ‘రచ్చ’బండ

Published Thu, Nov 14 2013 2:37 AM

Political rachabanda

బొబ్బిలి/రూరల్, న్యూస్‌లైన్ :  రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ ఎత్తుగడలకు ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని ఆ పార్టీ నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారు. బొబ్బిలి రాజులు, వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ బొబ్బిలి నియోజకవర్గంలో జరుగుతు న్న రచ్చబండ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా రు. ఇక్కడ జరిగే కార్యక్రమాలకు ఆయన ఆ పార్టీలో ఉన్న కొంతమందితో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కూడా ఉత్తర్వులు జారీ చేసేంది.  బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ కార్యక్రమానికి అధికారికంగా ఎమ్మెల్యే లేకపోవడంతో మంత్రి బొత్స బొబ్బిలిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఏకంగా మం డలానికి ఒక కమిటీని నియమించారు. మాజీ ఎమ్మెల్యే, పీసీసీ కార్యవర్గ సభ్యుడు శంబంగి వెంకట చినఅప్పలనాయుడుకు తెర్లాం మండలం మినహా మిగతా అన్ని మండలాల్లోనూ ప్రత్యేక స్థానం కల్పించారు. సర్పంచ్‌లను చైర్మన్లుగా, మిగతా అధికార పార్టీ పెద్దలను సభ్యులుగా నియమించారు. దీనికి జిల్లా యంత్రాంగం ఆమో దం తెలిపి ఆయా మండల, మున్సిపాలిటీలకు ఉత్తర్వు లు జారీ చేసింది. వారి ఆధ్వర్యంలోనే రచ్చబండ నిర్వహించాలని పేర్కొరింది. బొబ్బిలి పురపాలక సంఘానికి శంబంగితో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటి గోపాలరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సావు కృష్ణమూర్తినాయుడులను కమిటీగా నియమిస్తూ మున్పిపల్ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యూరుు.

అలాగే బొబ్బిలి మండలానికి శంబంగితో పాటు ఆయన సోదరుడు పక్కి సర్పంచ్ శంబంగి వేణుగోపాలనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు బొద్దల పద్మావతిలను కమిటీగా వేశారు.  తెర్లాంలో నందబలగ సర్పంచ్ గుల్లి పల్లి శ్రీనివాసరావు చైర్మన్‌గా, ఆ మండల అధికార పార్టీ నాయకుడు నర్సుపల్లి బాబ్జీరావు, రాజయ్యపేట సర్పం చ్ గవర సత్యవతిలను సభ్యులుగా నియమించారు. బాడంగిలో శంబంగితో పాటు సర్పంచ్ చొక్కాపు ఆది లక్ష్మి చైర్మన్‌గా, డీసీసీబీ డెరైక్టర్ వాసిరెడ్డి తిలక్ కిరణ్ కుమార్ సభ్యులుగా కమిటీని వేశారు. రామభద్రపురం మండలానికి శంబంగితో పాటు దుప్పలపూడి సర్పంచ్ మరవ సత్యవతి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అప్పికొండ శ్రీరాములునాయుడులను కమిటీగా నియమించారు.
 నియోజకవర్గంలో పట్టుకోసమే...
 రచ్చబండ ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నా యకులు పక్కా ప్రణాళికతో ప్రజల వద్దకు వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. బొబ్బిలిలో ఉంటున్న ఓ నాయ కుడు ముందుగానే ఆయూ మండలాల్లో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ వారికి, తమను నమ్ముకున్న వారికి ఎలాగైనా పింఛన్లు, ఇళ్లు ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేకాధికారులతో సంతకాలు చేయిస్తానని హామీ ఇస్తున్నారు. ఏదిఏమైనా ఆ పార్టీ నాయకులు రచ్చబండను రాజకీయంగా ఉపయో గించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement