కారులో తరలిస్తున్న రూ.9 లక్షలు సీజ్ | Police seized Rs.9 lakhs in Adilabad District | Sakshi
Sakshi News home page

కారులో తరలిస్తున్న రూ.9 లక్షలు సీజ్

Mar 13 2014 10:36 AM | Updated on Aug 17 2018 2:51 PM

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులోభాగంగా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కారులో తరలిస్తున్న రూ. 9 లక్షలను గురువారం పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆ నగదుతోపాటు కారును సీజ్ చేశారు. నగదుకు సంబంధించిన వివరాలు వెల్లడించడంలో వాహనం డ్రైవర్ మీన మేషాలు లెక్కించడంతో ఆ నగదును పోలీసులు సీజ్ చేశారు. అనంతరం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 45 లక్షల నగదును సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement