కృష్ణా జిల్లా గుడివాడలోని ఆఫీసర్స్ క్లబ్‌పై శనివారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేశారు.
గుడివాడ (కృష్ణా) : కృష్ణా జిల్లా గుడివాడలోని ఆఫీసర్స్ క్లబ్‌పై శనివారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరుషంగా మాట్లాడారనే కారణంతో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఉండటంతో పై స్థాయిలో పైరవీలు మొదలయ్యాయి.
కాగా తమ వారిని విడిపించుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమై...నేతలకు బదులు మిగతావారిని పోలీసుల అదుపులో ఉంచేందుకు అంగీకారం కుదిరిందని సమాచారం. అరెస్టుల వివరాలు కొద్దిసేపట్లో పోలీసులు మీడియా ముందు వెల్లడించనున్నారు.