కేసీఆర్తో అనురాగ్ శర్మ, డీజీపీతో చంద్రబాబు భేటీ | police officials met kcr, chandrababu naidu | Sakshi
Sakshi News home page

కేసీఆర్తో అనురాగ్ శర్మ, డీజీపీతో చంద్రబాబు భేటీ

Jun 20 2015 10:58 AM | Updated on Aug 15 2018 9:27 PM

కేసీఆర్తో అనురాగ్ శర్మ, డీజీపీతో చంద్రబాబు భేటీ - Sakshi

కేసీఆర్తో అనురాగ్ శర్మ, డీజీపీతో చంద్రబాబు భేటీ

రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు శనివారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు శనివారం ఉదయం  పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో డీజీపీ అనురాగ్ శర్మ ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసుతో పాటు, టీ న్యూస్ ఛానల్కు నోటీసులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, ఏసీబీ డీజీతో సమావేశం అయ్యారు. తాజా పరిణామాలను చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రెచ్చగొట్టేలా ప్రసారాలు చేశారంటూ టీ న్యూస్ ఛానల్కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అర్థరాత్రి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement