కర్నూలులో ప్రభుత్వ పాఠశాలల దత్తత: ఎస్పీ రవికృష్ణ | 'Police department will adopt Government Schools in Kurnool' says SP Ravi krishna | Sakshi
Sakshi News home page

కర్నూలులో ప్రభుత్వ పాఠశాలల దత్తత: ఎస్పీ రవికృష్ణ

Nov 20 2015 3:44 PM | Updated on Jul 26 2019 5:58 PM

కర్నూలు జిల్లాలోని 141 ప్రభుత్వ పాఠశాలలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో దత్తత తీసుకుంటామని ఎస్పీ రవికృష్ణ తెలిపారు.

ఆలూరు : కర్నూలు జిల్లాలోని 141 ప్రభుత్వ పాఠశాలలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో దత్తత తీసుకుంటామని ఎస్పీ రవికృష్ణ తెలిపారు. శుక్రవారం ఆలూరు సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలను పోలీసు సిబ్బంది దత్తత తీసుకుని వాటిల్లో కనీస వసతుల కల్పన, విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement