పోలీస్ వలయంలో తిరుపతి నగరం | Police circuit Tirupati city | Sakshi
Sakshi News home page

పోలీస్ వలయంలో తిరుపతి నగరం

Feb 13 2015 1:45 AM | Updated on Sep 2 2017 9:12 PM

పోలీస్ వలయంలో తిరుపతి నగరం

పోలీస్ వలయంలో తిరుపతి నగరం

తిరుపతి ఉపఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టీ

ఉప ఎన్నికల పోలింగ్‌కు పోలీసులు సిద్ధం
సమస్యాత్మక ప్రాంతాలపై ఎస్పీ దృష్టి
అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చర్యలే
చెక్‌పోస్ట్‌ల్లో తనిఖీలు 1,800 మందితో బందోబస్తు


తిరుపతి క్రైం: తిరుపతి ఉపఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టీ ఆధ్వర్యంలో పోలింగ్‌కు పోలీసులు సిద్ధమయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే లక్ష్యంగా సాగుతున్నారు.  9 చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. ఈ చెక్‌పోస్టుల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. అటువైపుగా వెళ్లే వాహనాలను అనుమానం ఉన్న వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఓ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేశారు. ఎవ్వరైనా ఎక్కడైనా రిగ్గింగ్‌కు పాల్పడినా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా 0877-2289043 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
 
103 ముఖ్యమైన ప్రాంతాలు

తిరుపతి నియోజకవర్గంలో 103 ము ఖ్యమైన ప్రాంతాలను గుర్తించారు. ఇందులో 43 అతి సమస్యాత్మక ప్రాం తాలు, 28 సమస్యాత్మక ప్రాంతాలు, 34 సాధారణ ప్రాంతాలుగా గుర్తించామన్నారు. వీటికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం  ఈ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ బూత్‌లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ముం దస్తు చర్యలు చేపట్టారు.  
 
భారీ భద్రత

256 పోలింగ్ కేంద్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్‌సీసీ టీమ్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్, 5పారామిలటరీ దళాలు, 34 పోలీస్ పికెట్లు, 32 రూట్ మొబైల్స్‌ను ఏర్పాటుచేశారు.  తిరుపతి నగరం మొత్తం పోలీస్ వలయంలోకి తీసుకున్నారు.  జిల్లాలో ఇప్పటికే మద్యం దుకాణాలు, బార్లు అన్నీ మూతపడ్డాయి. ఎవ్వరైనా మద్యం బాటిళ్లతో కనిపిస్తే ఎక్సైజ్‌శాఖ కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకుంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement