శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించండి

SP gopinath jetty video conference to sub divisions - Sakshi

ఎన్నికలు సమీపిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ గోపీనాథ్‌ జట్టీ

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జట్టీ పోలీసులకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నంచి అన్ని సబ్‌ డివిజన్ల పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమస్యలు ఉన్నచోట 30 పోలీసు యాక్టు, 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. ప్రతి సబ్‌ డివిజన్‌ పరిధిలో ఎలక్షన్‌ సెల్‌ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో నేరస్తులు చెలరేగిపోయే అవకాశం ఉందన్నారు. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. ఇంటర్‌ పరీక్షా కేంద్రాల దగ్గర ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు.  మహిళలు, చిన్నపిల్లలపై నేరాలు జరగకుండా చూడాలన్నారు.

బాల నేరస్తులైన వారి ఆలోచన విధానాలను మార్చేలా చూడాలన్నారు. ఈ చలనాలో రెండు సార్లు పట్టుబడిన వారు జిల్లాలో 650 మంది ఉన్నారని, వారి డ్రైవింగ్‌ లైసెన్సును రద్దు చేయాలని సూచించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లలో పట్టుబడిన వారిలో మార్పు వచ్చేలా చూడాలన్నారు. జాతీయ రహదారులకు అనుకొని ఉన్న పోలీసు స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీలు పి.షేక్షావలి, ఐ.వెంకటేష్, ఓఎస్‌డీ రవిప్రకాష్, డీఎస్పీలు ఖాదర్‌బాషా, వెంకటాద్రి, హుస్సేన్‌ పీరా, నజీముద్దీన్, సీఐలు దివాకర్‌రెడ్డి, షరీఫ్‌ ఉద్దీన్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top