
ఢిల్లీ: మహిళా న్యాయవాదిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణకు హాజరయ్యేందుకు అనర్హులుగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే?
ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన సంస్థ, ప్రతివాది సంస్థ తరుఫు విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించింది. కేసు వాదనలు జరిగే సమయంలో ఓ మహిళ న్యాయవాది.. న్యాయమూర్తి వాదనలు వినకుండా వీడియోను ఆఫ్ చేసి, సంభాషణలను మ్యూట్‌లో పెట్టారు. ఇది గమనించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కారియా మహిళా న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
2025 జూలై 4న ఢిల్లీ హైకోర్టు విడుదల చేసిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వీడియో కాన్ఫరెన్సుగా నిబంధనలను మహిళ న్యాయవాది ఉల్లంఘించారని గుర్తు చేశారు. విచారణ జరుగుతున్న సమయంలో న్యాయవాది వీడియో ఆఫ్ చేసి, మ్యూట్‌లోకి వెళ్లడం వీసీ నిబంధనలకు విరుద్ధం’ అని కోర్టు పేర్కొంది. అందుకు సదరు మహిళా న్యాయవాది తాను మరో కేసు విచారణలో పాల్గొనాల్సి ఉంది. అందుకే వీడియో ఆఫ్ చేసినట్లు తెలిపారు. అనంతరం, జస్టిస్ తేజస్ కారియా..సదరు మహిళ న్యాయవాది విచారణ మధ్యలో వీడియో ఆఫ్ చేసి, విచారణను మ్యూట్‌లో పెట్టినందుకు ఆమె ఇకపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావడాన్ని నిషేధించింది.
ఢిల్లీ హైకోర్టులో శ్రీరామ్ ఫార్మ్స్ పై మహీంద్ర హెచ్‌జెడ్‌పీసీ కేసు వేసింది.‘ఎస్‌ఆర్‌ఎఫ్-C51’ అనే బంగాళాదుంప రకాన్ని తన మహీంద్ర సంస్థకు చెందిన ‘Colomba’ వేరియంటుతో పోల్చి అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపణలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టి ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తాత్కాలికంగా ‘SRF-C51’ వేరియంటు ఉత్పత్తి, అమ్మకాలు, ప్రచారం చేయడాన్ని నిషేధించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది.