నేడు తుపానుపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ | YS Jagan holds video conference with party leaders on cyclone today | Sakshi
Sakshi News home page

నేడు తుపానుపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

Oct 30 2025 5:19 AM | Updated on Oct 30 2025 7:52 AM

YS Jagan holds video conference with party leaders on cyclone today

సాక్షి, అమరావతి: మోంథా తుపాను నేపథ్యంలో వైఎస్సార్‌­సీపీ రీజినల్‌ కో–ఆర్డి­నేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో గురు­వా­రం ఉ.11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించను­న్నారు. తుపాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న ప­రి­స్థి­తులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్‌ను ఆయన అడిగి తెలుసుకోను­న్నారు. 

బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైఎస్‌ జగన్‌ పిలుపు మేర­కు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. శ్రీకాకుళం నుంచి తిరు­పతి వరకూ జిల్లా అధ్యక్షులు, నియోజ­కవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుపాను బాధితులకు బాసటగా నిలిచారు. 

ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారి­కి ఆహారం అందించడంలో సేవలందించారు.  తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థా­యిలో పర్యటించి నష్టపోయిన బాధితు­లకు భరోసా ఇవ్వడంతో పాటు వివ­రాలను సేకరించారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్‌ జగన్‌కు వివరించనున్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement