‘పోగొండ’కు రూ.85.51 కోట్లు | Pogoda Reservoir Construction Rs .85.51 crore Funding Sanctioned | Sakshi
Sakshi News home page

‘పోగొండ’కు రూ.85.51 కోట్లు

Jun 12 2014 1:00 AM | Updated on Jul 7 2018 2:56 PM

‘పోగొండ’కు రూ.85.51 కోట్లు - Sakshi

‘పోగొండ’కు రూ.85.51 కోట్లు

బుట్టాయగూడెం మండలం చింతలగూడెం సమీపంలో పోగొండ రిజర్వాయర్ నిర్మాణానికి రూ.85.51 కోట్ల నిధులు మంజూరైనట్లు మైనర్ ఇరిగేషన్ ఈఈ ఎస్.జగదీశ్వరరావు,

జంగారెడ్డిగూడెం : బుట్టాయగూడెం మండలం చింతలగూడెం సమీపంలో పోగొండ రిజర్వాయర్ నిర్మాణానికి రూ.85.51 కోట్ల నిధులు మంజూరైనట్లు మైనర్ ఇరిగేషన్ ఈఈ ఎస్.జగదీశ్వరరావు, డీఈ కె.సుబ్రమణ్యం బుధవారం తెలిపారు. రిజర్వాయర్ డిజైన్ మార్పు కారణంగా భూ సేకరణకు సంబంధించి ప్రతిపాదనలను మార్పుచేసి 2011 మే నెలలో ప్రభుత్వానికి నివేదించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటీవల నిధులు మంజూరయ్యూయని పేర్కొన్నారు. 50 ఏళ్లుగా సర్వేలకే పరిమితమైన పోగొండ రిజర్వాయర్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో రూ.26కోట్లు మంజూరు చేశారు.
 
 అప్పట్లో సుమారు రూ.11 కోట్లు వెచ్చించి కొంతమేర పనులు చేపట్టారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తరుుతే.. సుమారు 11 గ్రామాల పరిధిలో గిరిజనులకు చెందిన బీడు భూములు సాగులోకి వస్తాయి. డిజైన్ మార్పు చేయాల్సి రావడంతో భూసేకరణకు సంబంధించి రీ ఎస్టిమేషన్ వేశారు. దీంతో పనులకు నిధుల కొరత వచ్చింది. ఫలితంగా ఏడాదిన్నర కాలంగా పనులు నిలచిపోయాయి. తాజాగా నిధులు విడుదలైన నేపథ్యంలో త్వరలోనే పోగొండ రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తిచేసి గిరిజనులకు చెందిన భూములు సాగునీరు అందిస్తామని మైనర్ ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement