ఆధార్‌ను ఈపీడీఎస్‌కు అనుసంధానం చేయండి | Please connect Aadhaar with EPDS | Sakshi
Sakshi News home page

ఆధార్‌ను ఈపీడీఎస్‌కు అనుసంధానం చేయండి

Aug 18 2013 4:50 AM | Updated on Sep 1 2017 9:53 PM

ఆధార్ కార్డు నెంబర్‌ను వారంలోగా ఈపీడీఎస్ (ఎలక్ట్రానిక్ పబ్లిక్ డెలివరీ సిస్టం)కు అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్

మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, న్యూస్‌లైన్: ఆధార్ కార్డు నెంబర్‌ను వారంలోగా ఈపీడీఎస్ (ఎలక్ట్రానిక్ పబ్లిక్ డెలివరీ సిస్టం)కు అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లయి డిప్యూటీ డెరైక్టర్ రాథోడ్ ఆదేశించారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈపీడీఎస్‌పై డిప్యూటీ తహశీల్దార్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. సివిల్ సప్లయ్ శాఖ ద్వారా లబ్ధిదారులకు అం దుతున్న రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ విధానం ప్రవేశపెట్టిందన్నారు. ఈపీడీఎస్‌కు ఆధార్ కా ర్డు నెంబర్‌ను అనుసంధానం చేయడం ద్వారా ప్రతి లబ్ధిదారుడికి సరుకులు అందుతాయన్నారు. సరుకుల పంపిణీ, లబ్ధిదారులు, స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు ఈ విధానం ద్వారా తెలుస్తాయన్నారు. ఈపీడీఎస్ విధానాన్ని మొ దట ప్రయోగాత్మకంగా తూర్పుగోదావరి, హైదరాబాద్ జిల్లాల్లోని 45 రేషన్ దుకాణాల్లో అమలు చేసినట్లు వివరించారు. 
 
 ఆయా జిల్లా ల్లో విజయవంతమైనందున రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆధార్ కార్డు నెంబర్‌ను ఈపీడీఎస్‌కు అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కోరారు. కొన్ని జిల్లా లో చాలా మంది ఆధార్ కార్డులు దిగలేదని, వారి కోసం నెల 19 నుంచి ప్రత్యేకంగా కేంద్రా లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు ఆధార్ నెంబర్‌ను ఈపీడీఎస్‌కు అనుసంధానం చేసే విధానంపై  ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ట్రైనింగ్ అధికారి డి.శ్రీనివాస్, సివిల్ సప్లయి అధికారి సయ్యద్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement