‘ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్లు’

Pilli Subhash Chandra Bose Said House Pattas Will Give On Ugadi - Sakshi

సాక్షి, అనంతపురం: అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగాదికి ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ వెంటనే స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులను సమూల ప్రక్షాళన చేయాలని తెలిపారు. అదేవిధంగా పెండింగ్ కేసులన్నీ వెంటనే పరిష్కరించాలని, భూ ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top