సెప్టెంబర్ 10న మీ ఇంటికే పీఎఫ్ ఫిర్యాదులు | PF complaints give at visakhapatnam sub regional office | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 10న మీ ఇంటికే పీఎఫ్ ఫిర్యాదులు

Aug 21 2015 9:39 PM | Updated on Sep 2 2018 3:34 PM

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న మీ ఇంటికే పీఎఫ్ ‘నిధి ఆప్కే నికత్’(మీ వద్దకే పీఎఫ్) ను నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ డి.మాధవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

విశాఖపట్నం: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న మీ ఇంటికే పీఎఫ్ ‘నిధి ఆప్కే నికత్’(మీ వద్దకే పీఎఫ్) ను నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ డి.మాధవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో దీనినే భవిష్యనిధి అదాలత్‌గా పిలిచేవారు. ఆ రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ మర్రిపాలెం ఉడా లే అవుట్‌లోని విశాఖ సబ్ రీజనల్ ఆఫీస్‌లో ఫిర్యాదులు స్వీకరించనునున్నట్లు పేర్కొన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఉద్యోగులు తమ ఫిర్యాదులను సెప్టెంబర్ 5వ తేదీ లోగా పీఎఫ్ కమిషనర్‌కు పోస్టు లేదా కోరియర్, లేదా ఫ్యాక్స్(నెం0891-2558734) ద్వారా తెలియజేసి రిజిస్టర్ చేసుకోవాలని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement