
క్షణక్షణం..భయం..భయం
ఏ నిమిషానికి ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో..ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందో..
నెల్లూరు(క్రైమ్): ఏ నిమిషానికి ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో..ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందో.. ఎక్కడ ఎవరు ప్రాణాలు కోల్పోతారో..దొంగలు ఎటువైపు నుంచి విరుచుకుపడతారోననే భయంతో జిల్లా వాసులు క్షణక్షణం..భయంభయంగా గడుపుతున్నారు. జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటుండటమే ఇందుకు నిదర్శనం.
నెల్లూరు(క్రైమ్): ఓ దోపిడీ దొంగల ముఠా నెల్లూరు శివారులోని అయ్యప్పగుడి సమీపంలో బీభత్సం సృష్టింది. ఓ వైన్‌షాపు టార్గెట్‌గా దోపిడీకి వచ్చి ఒకరిని హతమార్చడంతో పాటు మరొకరిని తీవ్రంగా గాయపరిచింది. ఆదివా రం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి రావడంతో నెల్లూరులో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసుల కథనం మే రకు..వెంకటాచలం మండలం చెముడుగుంటకు కుంకాల శ్రీనివాస్‌యాదవ్ అయ్యప్పగుడి నుంచి హైవేకు వెళ్లే కూడలి ప్రాంతంలో చింతాళమ్మ వైన్స్ పేరిట మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. సైదాపురం మండలం తూర్పుగుంట్లకు చెందిన చంద్రయ్య కసుమూరులో కాపురం ఉంటూ ఆ దుకాణంలో నైట్ సేల్స్‌మన్‌గా వ్యవహరిస్తున్నాడు.
గుంటూరు ఎస్‌వీఎన్ కాలనీకి చెంది న దేవినేని శ్రీనివాసులు(38) కొంతకాలంగా బ్రాందీషాపు ఆవరణలో నూడి ల్స్, టిఫిన్ వ్యాపారం చేస్తున్నాడు. రా త్రి వేళలో చంద్రయ్యకు తోడుగా వైన్‌షాపులోనే నిద్రపోయేవాడు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా షాపు ఆవరణలో నిద్రపోగా, చంద్రయ్య నైట్ సేల్స్ కోసం దుకాణం వెనుక ఉన్న గది లో ఉన్నాడు. రాత్రి 1.30 గంటల సమయంలో నలుగురు యువకులు వెనుకవైపు ఉంచి దుకాణం ఆవరణలోకి ప్రవేశించారు. అక్కడే బల్లపై నిద్రపోతున్న శ్రీనివాసులును తలపై రాడ్‌తో కొట్టి హతమార్చారు. అలికిడి కావడంతో తానున్న గది కిటికీ తెరిచిచూసిన చం ద్రయ్యను ఓ వ్యక్తి క్యాట్‌బాల్‌తో కొట్టడంతో తలకు తీవ్రగాయమైంది. తేరుకునేలోపే మరో వ్యక్తి రాడ్‌తో తలపై పొడిచాడు. అతడిని ఆ గదిలోనే బంధించి ఇద్దరు యువకులు వైన్‌షాపు షర్టర్ పగలగొట్టి లోనికి ప్రవేశించారు.
ఒకడు మంకీ క్యాప్ ధరించగా మరొకడు ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నాడు. క్యాష్ కౌంటర్ ఎక్కడుందని చంద్రయ్యను హిందీలో ప్రశ్నించి అతడి సెల్‌ఫోన్ లాక్కున్నారు. కౌంటర్‌లోని కొం త చిల్లరనగదు, రెండు మద్యం సీసాలను తీసుకుని వచ్చిన దారిలోనే వెళ్లిపోయారు. వారు బయటే ఉంటారని భా వించిన చంద్రయ్య బిక్కుబిక్కుమం టూ లోపలే ఉన్నాడు. తెల్లవారుజాము న 4 గంటల సమయంలో మద్యం కో సం వచ్చిన ఓ వ్యక్తి సాయంతో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే తన యజమాని ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలా న్ని సిటీ డీఎస్పీ ఎస్ మగ్బుల్, ఐదో నగర ఇన్‌స్పెక్టర్ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సోమయ్య పరిశీ లించారు. క్లూస్‌టీం వేలిముద్రలు సేకరించింది. పోలీసు జాగిలం దుకాణం వెనుకవైపున్న చెట్లు, ఖాళీ ప్రదేశంలో తిరుగతూ తల్పగిరికాలనీ వైపు వెళ్లింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీల ఆధారంగా నింది తుల కోసం ఆరా తీస్తున్నారు. దోపిడీకి పాల్పడింది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.
తడ సమీపంలో దారిదోపిడీయత్నం
సూళ్లూరుపేట(తడ): తడ-శ్రీకాళహస్తి రోడ్డులోని విన్నమాలగుంట అటవీప్రాంతంలో ఓ వ్యాపారిని దోచుకునేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..సూళ్లూరుపేటలోకి కోళ్లమిట్టకు చెందిన చంద్రమౌళిరెడ్డి కోళ్ల వ్యాపారి. వ్యాపార పనుల్లో భాగంగా చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం వెళ్లిన ఆయన అక్కడ నుంచి రూ.3.5 లక్షలు తీసుకుని బైక్‌పై తిరుగుముఖం పట్టాడు. ఆయన దగ్గర నగదు ఉందని గమనించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వెంబడించారు.
విన్నమాలగుంట వద్ద అటవీప్రాంతంలో ఆయన బైక్‌ను అడ్డుకున్నారు. కత్తితో దాడి చేసి నగదు లాక్కునే ప్రయత్నం చేశారు. చంద్రమౌళిరెడ్డి తిరగబడి వారి బారి నుంచి తప్పించుకుని రక్తగాయాలతోనే తడలోని హుస్సేన్ చికెన్ స్టాల్ వద్దకు వచ్చి పడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే తడ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘటనా స్థలం వరదయ్యపాళెం పరిధిలో ఉండటంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి, చంద్రమౌళిరెడ్డి సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని విజయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వరదయ్యపాళెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.