Dongala Muta
-
నలుగురు దొంగలు..48 నేరాలు
అనంతపురం క్రైం : భారీ ఎత్తున చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠాను సీసీఎస్ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 36 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు సోమవారం వెల్లడించారు. పట్టుబడిన వారిలో కదిరి పట్టణం కుటాగుళ్లకు చెందిన పీట్ల ఆంజనేయులు అలియాస్ అంజి, రొద్దం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అలియాస్ శీనా, కంబదూరు మండలం తిప్పేపల్లికి చెందిన ఎరికల గంగన్న అలియాస్ పాచి గంగడు, కంబదూరుకు చెందిన ఎరికల సోమశేఖర్ ఉన్నారు. వీరి నుంచి 1.11 కిలోల బంగారం నగలు, 7 కిలోల వెండి ఆభరణాలు, రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ ముఠా నేపథ్యం : పట్టుబడిన వారిలో పీట్ల ఆంజనేయులు అలియాస్ అంజి కీలక పాత్రదారి. పందుల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతను తాగుడు, పేకాట, కోడి పందేలు తదితర జూదాలకు అలవాడు పట్టాడు. తాడిపత్రి, గోరంట్ల ప్రాంతాలకు వెళ్లి తరచూ జూదాలు ఆడేవాడు. ఈ క్రమంలో తక్కిన ముగ్గురు నిందితులు ఇతనికి పరిచయమయ్యారు. వీరికున్న వ్యసనాలు, దురలవాట్లు తీర్చుకునేందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో దొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా ప్రధానంగా తాళం వేసిన ఇళ్లను ఎంపిక చేసుకుంటారు. ఎవరూ లేని సమయంలో అదునుచూసి పగలు-రాత్రి తేడా లేకుండా ఇళ్ల తాళాలను పగలకొట్టి లోపలికి ప్రవేశిస్తారు. ఇంట్లో దాచిన విలువైన బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు ఎత్తుకెళ్తారు. వీటితోపాటు ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలు, పురుషులను వెంబడించి వారి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కెళ్తారు. ఏడాదిలో 48 నేరాలు : ఏడాదిలో ఈ ముఠా 48 నేరాలకు పాల్పడింది. వీటిలో అధికంగా ఇళ్లకు వేసిన తాళాలు పగలకొట్టి అల్మారా, బీరువాల్లో దాచిన బంగారు, వెండి ఎత్తుకెళ్లిన నేరాలే. అనంతపురం నగరంతో పాటు రాప్తాడు, బుక్కరాయసముద్రం, పుట్టపర్తి, కసాపురం, పాల్తూరు, తాడిపత్రి, కనగానపల్లి, ఉరవకొండ, గోరంట్ల, గుంతకల్లు, లేపాక్షి, గార్లదిన్నె, గుత్తి, కూడేరు, ధర్మవరం, యాడికి, హిందూపురం, తాడిమర్రి, విడపనకల్లు, రాయదుర్గం, కుందుర్పి, పెద్దవడుగూరు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారు. పీట్ల ఆంజనేయులు మినహా తక్కిన ముగ్గురు నిందితులూ పాత నేరస్తులే. ఎరికల సోమశేఖర్ చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడి రిమాండ్‌కు కూడా వెళ్లొచ్చాడు. ఎరికల గంగన్న గతేడాది కళ్యాణదుర్గం ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకెళ్లొచ్చాడు. శ్రీనివాసరెడ్డి కర్ణాటకలోని వైఎన్హెచ్కోటలో జరిగిన ఓ దారిదోపిడీ కేసులో నిందితుడు. ఎస్పీ ఆదేశాలతో ముఠా గుట్టు రట్టు : దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచాలనే ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదేశాలతో అదనపు ఎస్పీ కె.మాల్యాద్రి పర్యవేక్షణలో సీసీఎస్ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు జి.రాజశేఖర్, ఆనందరావు, అశోక్‌రెడ్డి, శుభకుమార్, ఎస్ఐలు సుబ్బరాయుడు, రవిశంకర్‌రెడ్డి, జి.రాజు, జనార్దన్‌నాయుడు, ఏఎస్ఐలు సాదిక్‌బాషా, అంజాద్‌వలి, వరలక్ష్మి సిబ్బందితో బృందాలకు ఏర్పడ్డారు. ఈ క్రమంలో సీసీఎస్ డీఎస్పీకి పక్కా సమాచారం అందడంతో ఈ బృందాలు స్థానిక జాతీయ రహదారి సమీపంలో కక్కలపల్లిక్రాస్లో ముఠా సభ్యులను అరెస్టు చేశాయి. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పలువురికి వ్యక్తిగత రివార్డులు అందజేశారు. -
క్షణక్షణం..భయం..భయం
నెల్లూరు(క్రైమ్): ఏ నిమిషానికి ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో..ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందో.. ఎక్కడ ఎవరు ప్రాణాలు కోల్పోతారో..దొంగలు ఎటువైపు నుంచి విరుచుకుపడతారోననే భయంతో జిల్లా వాసులు క్షణక్షణం..భయంభయంగా గడుపుతున్నారు. జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటుండటమే ఇందుకు నిదర్శనం. నెల్లూరు(క్రైమ్): ఓ దోపిడీ దొంగల ముఠా నెల్లూరు శివారులోని అయ్యప్పగుడి సమీపంలో బీభత్సం సృష్టింది. ఓ వైన్‌షాపు టార్గెట్‌గా దోపిడీకి వచ్చి ఒకరిని హతమార్చడంతో పాటు మరొకరిని తీవ్రంగా గాయపరిచింది. ఆదివా రం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి రావడంతో నెల్లూరులో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసుల కథనం మే రకు..వెంకటాచలం మండలం చెముడుగుంటకు కుంకాల శ్రీనివాస్‌యాదవ్ అయ్యప్పగుడి నుంచి హైవేకు వెళ్లే కూడలి ప్రాంతంలో చింతాళమ్మ వైన్స్ పేరిట మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. సైదాపురం మండలం తూర్పుగుంట్లకు చెందిన చంద్రయ్య కసుమూరులో కాపురం ఉంటూ ఆ దుకాణంలో నైట్ సేల్స్‌మన్‌గా వ్యవహరిస్తున్నాడు. గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెంది న దేవినేని శ్రీనివాసులు(38) కొంతకాలంగా బ్రాందీషాపు ఆవరణలో నూడి ల్స్, టిఫిన్ వ్యాపారం చేస్తున్నాడు. రా త్రి వేళలో చంద్రయ్యకు తోడుగా వైన్‌షాపులోనే నిద్రపోయేవాడు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా షాపు ఆవరణలో నిద్రపోగా, చంద్రయ్య నైట్ సేల్స్ కోసం దుకాణం వెనుక ఉన్న గది లో ఉన్నాడు. రాత్రి 1.30 గంటల సమయంలో నలుగురు యువకులు వెనుకవైపు ఉంచి దుకాణం ఆవరణలోకి ప్రవేశించారు. అక్కడే బల్లపై నిద్రపోతున్న శ్రీనివాసులును తలపై రాడ్‌తో కొట్టి హతమార్చారు. అలికిడి కావడంతో తానున్న గది కిటికీ తెరిచిచూసిన చం ద్రయ్యను ఓ వ్యక్తి క్యాట్‌బాల్‌తో కొట్టడంతో తలకు తీవ్రగాయమైంది. తేరుకునేలోపే మరో వ్యక్తి రాడ్‌తో తలపై పొడిచాడు. అతడిని ఆ గదిలోనే బంధించి ఇద్దరు యువకులు వైన్‌షాపు షర్టర్ పగలగొట్టి లోనికి ప్రవేశించారు. ఒకడు మంకీ క్యాప్ ధరించగా మరొకడు ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నాడు. క్యాష్ కౌంటర్ ఎక్కడుందని చంద్రయ్యను హిందీలో ప్రశ్నించి అతడి సెల్‌ఫోన్ లాక్కున్నారు. కౌంటర్లోని కొం త చిల్లరనగదు, రెండు మద్యం సీసాలను తీసుకుని వచ్చిన దారిలోనే వెళ్లిపోయారు. వారు బయటే ఉంటారని భా వించిన చంద్రయ్య బిక్కుబిక్కుమం టూ లోపలే ఉన్నాడు. తెల్లవారుజాము న 4 గంటల సమయంలో మద్యం కో సం వచ్చిన ఓ వ్యక్తి సాయంతో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే తన యజమాని ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలా న్ని సిటీ డీఎస్పీ ఎస్ మగ్బుల్, ఐదో నగర ఇన్స్పెక్టర్ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ సోమయ్య పరిశీ లించారు. క్లూస్‌టీం వేలిముద్రలు సేకరించింది. పోలీసు జాగిలం దుకాణం వెనుకవైపున్న చెట్లు, ఖాళీ ప్రదేశంలో తిరుగతూ తల్పగిరికాలనీ వైపు వెళ్లింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీల ఆధారంగా నింది తుల కోసం ఆరా తీస్తున్నారు. దోపిడీకి పాల్పడింది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. తడ సమీపంలో దారిదోపిడీయత్నం సూళ్లూరుపేట(తడ): తడ-శ్రీకాళహస్తి రోడ్డులోని విన్నమాలగుంట అటవీప్రాంతంలో ఓ వ్యాపారిని దోచుకునేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..సూళ్లూరుపేటలోకి కోళ్లమిట్టకు చెందిన చంద్రమౌళిరెడ్డి కోళ్ల వ్యాపారి. వ్యాపార పనుల్లో భాగంగా చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం వెళ్లిన ఆయన అక్కడ నుంచి రూ.3.5 లక్షలు తీసుకుని బైక్‌పై తిరుగుముఖం పట్టాడు. ఆయన దగ్గర నగదు ఉందని గమనించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. విన్నమాలగుంట వద్ద అటవీప్రాంతంలో ఆయన బైక్‌ను అడ్డుకున్నారు. కత్తితో దాడి చేసి నగదు లాక్కునే ప్రయత్నం చేశారు. చంద్రమౌళిరెడ్డి తిరగబడి వారి బారి నుంచి తప్పించుకుని రక్తగాయాలతోనే తడలోని హుస్సేన్ చికెన్ స్టాల్ వద్దకు వచ్చి పడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే తడ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘటనా స్థలం వరదయ్యపాళెం పరిధిలో ఉండటంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి, చంద్రమౌళిరెడ్డి సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని విజయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వరదయ్యపాళెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.