
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విశాఖలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహించడం గొప్ప విషయం. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులకు తమ సమస్యలను నేరుగా ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలిగింది. బ్రాహ్మణ సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడే వ్యక్తి జగన్ అనేది రుజువయింది. దివంగత నేత వైఎస్ అర్చకుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. ఆయన అడుగుజాడల్లో జగన్ నడుస్తారనే నమ్మకం ఉంది.
– భారతి, బ్రాహ్మణ సంఘ మహిళా ప్రతినిధి