అడుగడుగునా ఆవేదన

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పశ్చిమగోదావరి : అన్నా.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువైంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే పథకాలు అందుతున్నాయి. మిగిలిన వాళ్లను పట్టించుకోవడం లేదు. అంటూ ఓ తమ్ముడి ఆవేదన..1100కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినాస్పందన లేదన్నా ఇది ఓ యువకుడి ఆక్రందన..టీడీపీ పాలనలో ఇంటికో ఉద్యోగం అన్నారు.. మాటలే తప్ప చేతలు కనిపించడం లేదు.. ఉద్యోగం కోసం ఐదుసార్లు దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదన్నా.. అంటూ దివ్యాంగురాలి కన్నీటి పర్యంతం..రైతులకు వడ్డీ రాయితీ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం, సొసైటీలు మింగేస్తున్నాయంటూ ఓ పెద్దాయన ఆక్రోశం ఇలా అడుగడుగునా ఆవేదనలు.. కన్నీటి గాథలు..కష్టాలు తెలుసుకుంటూ.. కన్నీళ్లు తుడుస్తూ జననేత జగన్‌ కొవ్వూరు పట్టణంలో ముందుకు సాగారు.

ఇది జనప్రభంజనం
తమది ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం అని, వారధిపై జగనన్నతో నడవడానికి వచ్చామని రేపాక చంద్రం, గాడి వెంకటరెడ్డి అన్నారు. లక్షలాది మంది జనం రావడం చూసి ఆశ్చర్యమేసిందని ఆనందం వ్యక్తం చేశారు. 2003లో మహానేత రాజశేఖరరెడ్డి పాదయాత్రనూ చూశామన్నారు.

ఇది అపూర్వ స్పందన
జగన్‌ పాదయాత్రను ప్రత్యక్షంగా చూసేం దుకు వచ్చామని పల్లంట్ల గ్రామానికి చెందిన పెదపాటి శ్రీను చెప్పారు. తమ జీవితంలో ఇంతటి జనసందోహాన్ని ఎన్నడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని, జగన్‌ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోందన్నారు.

రోడ్డు ఆక్రమణకు గురవుతోంది
కొవ్వూరు మండలం లోని వేములూరు గ్రామంలో సాయిబాబా గుడి ఎదురుగా రోడ్డు ఆక్రమణకు గురవుతోందని పాలా ప్రసాద్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన కార్యకర్తలు నివాసముంటున్న ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు రోడ్లు వేయించడం లేదని, ప్రశ్నిస్తే మీకు చేతనైంది చేసుకోమని బెది రింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలి
భవన నిర్మాణ కార్మి కుల సంక్షేమ బోర్డు చ ట్టాలను చంద్రన్న బీ మాలో కాకుండా కార్మి క శాఖ పర్యవేక్షణలో అ మలు చేయాలని భవన నిర్మాణ కార్మికుల సం ఘం నాయకుడు జొన్నపూడి శేఖర్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. నిర్మాణ కార్మికులకు వృద్ధాప్య, వితంతు, అంగవైకల్య పింఛన్లు, కార్మికుల పిల్లల చదువులకు ఉపకార వేతనాలు, పక్కా గృహాలు నిర్మాంచాలని కోరా రు. కొవ్వూరులో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటుచేయాలని కొవ్వూరులో జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

కాపులకు బీసీ చట్టబద్ధత కల్పించాలి
కాపులను బీసీల్లో చేరుస్తూ వచ్చిన జీఓకు చట్టబద్ధత వచ్చేలా కృషిచేయాలని తణుకుకి చెందిన అంబటి రాఘవ కొవ్వూరు వద్ద పాదయాత్రలో జగన్‌ని కలిసి కోరారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.2 వేల కోట్లు కేటాయించడంతోపాటు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

జన్మభూమి కమిటీలతో అన్యాయం
గ్రామాల్లో జన్మభూమి కమిటీల వల్ల అ న్యాయం జరుగుతోందని తాళ్లపాలెంకు చెందిన సింగులూరు వెంకటేశ్వరరావు జగన్‌ వద్ద మొరపెట్టు కున్నారు. తమ గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్‌ పార్టీకి చెందిన వారని అందుకనే అభివృద్ధి చేయకుండా తెలుగు దేశం పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని కొవ్వూరు వద్ద జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top