జన బలం ఉన్న నేత జగన్ | people leader ys jagan | Sakshi
Sakshi News home page

జన బలం ఉన్న నేత జగన్

Mar 22 2014 12:56 AM | Updated on Jul 25 2018 4:09 PM

జన బలం ఉన్న నేత జగన్ - Sakshi

జన బలం ఉన్న నేత జగన్

దేశంలో ప్రజాబలం ఉన్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి ప్రసాదరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక 14వ వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని కొత్తపల్లి ప్రారంభించారు.

నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్ :
దేశంలో ప్రజాబలం ఉన్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి ప్రసాదరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక 14వ వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని కొత్తపల్లి ప్రారంభించారు.
 
 అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాదరాజుతో కలిసి మాట్లాడారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల వారు భావిస్తున్నారన్నారు. నరసాపురం మునిసిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా సాయినాథ్ ప్రసాద్‌ను ఎంపిక చేసినట్టు ప్రకటించారు.  31 వార్డుల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
 ఏడాదిలోనే వశిష్ట వంతెన
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏడాదిలోనే నరసాపురం వశిష్ట వంతెన నిర్మాణం జరుగుతుందని నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. వంతెన ప్రాధాన్యతను, ఇక్కడి ప్రజల కోరికను జగన్‌మోహన్‌రెడ్డి అర్థం చేసుకున్నారన్నారు.
 
 పట్టణంలో పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలంటే వైసీపీని అధికారంలోకి తేవాలన్నారు. జిల్లాలోని అత్యధిక మునిసిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందన్నారు. చైర్మన్ అభ్యర్థి సాయినాథ్ ప్రసాద్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
 
 ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, పార్టీ సీనియర్ నేతలు పీడీ రాజు, పాలంకి ప్రసాద్, ఏడిద కోట సత్యనారాయణ (వైకేఎస్), దొంగ గోపి,  కూనపరెడ్డి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement