నార్కెట్పల్లి మండలం ఏపీలింగోటం వద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడిక్కడే మృతిచెందారు.
నల్గొండ: నార్కెట్పల్లి మండలం ఏపీలింగోటం వద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడిక్కడే మృతిచెందారు. రోడ్డు ప్రక్కన నడుస్తున్న పాదచారులపైకి ఓ కారు దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కారును అతివేగంగా నడపడం వల్లే అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లినట్టు తెలిసింది. ఈ ఘటనలో మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.