పాఠశాల భవనాన్ని ప్రారంభించిన పెద్దిరెడ్డి | Peddireddy Ramachandra Reddy Inaugurates ZP School Building At Telaprolu | Sakshi
Sakshi News home page

పాఠశాల భవనాన్ని ప్రారంభించిన పెద్దిరెడ్డి

Dec 24 2019 2:51 PM | Updated on Dec 24 2019 3:04 PM

Peddireddy Ramachandra Reddy Inaugurates ZP School Building At Telaprolu - Sakshi

సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలంలో తేలప్రోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి ప్రారంభించారు. వనరత్నాల పథకంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన ప్రవాస భారతీయుడు, పూర్వ విద్యార్థి భీమవరపు సోమశేఖర్‌ రెడ్డి రూ. కోటీతో ఈ పాఠశాల భవనాన్ని నిర్మించారు.

అదే విధంగా పాఠశాల ఫర్నీచర్‌కు పది లక్షలు విరాళం అందించారు. ఈ స్కూల్‌ భవనం నాడు-నేడు కార్యక్రమంలో పూర్తి అయింది. పాఠశాల భవన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిలుగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని భాలశౌరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement