నందిగం సురేష్‌పై దాడిని నిరసిస్తూ శాంతి ర్యాలీ | Peace Rally In Vijayawada Condemned Attack On Nandigam Suresh | Sakshi
Sakshi News home page

నందిగం సురేష్‌పై దాడిని నిరసిస్తూ శాంతి ర్యాలీ

Feb 28 2020 6:09 PM | Updated on Feb 28 2020 6:13 PM

Peace Rally In Vijayawada Condemned Attack On Nandigam Suresh - Sakshi

సాక్షి, విజయవాడ : బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ శ్రేణుల దాడిని నిరసిస్తూ విజయవాడలో శుక్రవారం  శాంతి ర్యాలీని నిర్వహించారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో పాల్గొన్న నేతలు ఎంపీపై దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ.. జేఏసే ముసుగులో చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. దళితుడైన నందిగం సురేష్‌కు చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. కాగా అమరావతిలో ఈ నెల 23న జరిగిన రథమహోత్సవంలో పాల్గొన్న ఎంపీ సురేష్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. (ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement