నాకు గన్‌మెన్లు వద్దు: పవన్‌ కల్యాణ్‌ | Pawan Kalyan sent back his gunmens to AP DGP | Sakshi
Sakshi News home page

నాకు గన్‌మెన్లు వద్దు: పవన్‌ కల్యాణ్‌

Apr 18 2018 11:37 AM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan sent back his gunmens to AP DGP - Sakshi

పవన్‌ కల్యాణ్‌

సాక్షి, హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన గన్‌మెన్లను వెనక్కి పంపారు. తనకు భద్రత కల్పించాలని కోరుతూ గతనెలలో డీజీపీ మాలకొండయ్యకు పవన్‌ లేఖ రాశారు. ఈ క్రమంలో స్పందించిన ఏపీ ప్రభుత్వం పవన్‌కు నలుగురు గన్‌మెన్లను కేటాయించింది. రెండు షిఫ్టుల్లో ఇద్దరు గన్‌మెన్లు పనిచేసేలా విధులు కేటాయించారు. అయితే మంగళవారం రాత్రి పవన్ తన గన్‌మెన్లను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. అదే విధంగా తనకు కేటాయించిన గన్‌మెన్లు వద్దని ఆయన డీజీపీకి లేఖ ద్వారా తెలిపారు.

గన్‌మెన్లను వెనక్కి పంపడంపై పవన్ కల్యాణ్ కారణాలను వెల్లడించలేదు. కానీ జనసేనకు సంబంధించిన వ్యవహారాలను గన్‌మెన్ల ద్వారా ప్రభుత్వం తెలసుకుంటోందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నట్టుగా సమాచారం. అందుకోసమే వారిని వెనక్కు పంపినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement