సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో వెలుగు నింపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
హైదరాబాద్: సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో వెలుగు నింపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
కరెన్సీ నోట్ల రద్దు వంటి గాయాలు మళ్లీ చేయకుండా రాజకీయ పెద్దల నుంచి ప్రజలను కాపాడాలని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతికి ఉద్దానం కిడ్నీ బాధితులకు స్వాంతన కలగించాలని ప్రార్థించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.