పేగు బంధానికి మచ్చ తెచ్చిన తల్లిదండ్రులు

Parents Try To Put Child Dead Body In Bushes In Kurnool - Sakshi

సాక్షి, డోన్‌(కర్నూలు): పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ.. రెండు నెలల పసిగుడ్డు.. అనారోగ్యంతో మృతిచెందితే.. మానవత్వం మరిచి ముళ్లపొదల్లో పారవేసిన తల్లిదండ్రుల ఉదంతం ఇది. బనగానపల్లె మండలం లింగదొడ్డి గ్రామానికి చెందిన రాజు,లక్ష్మి అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుతూరు అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. దీంతో వారు నేరుగా మృత శిశువును రైలులో డోన్‌కు తీసుకొచ్చి పట్టణ శివారులోని లెప్రసీ కాలనీలో ముళ్లపొదల్లో పడవేశారు. దీన్ని గమనించిన ద్రోణాచలం సేవాసమితి సభ్యులు పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐలు సురేష్, నరేష్‌ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి మృత శిశువును ఖననం చేస్తామనే హామీతో వదిలివేశారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top