నాలుగేళ్ల వయసున్న కన్న కొడుకును అతడి తల్లిదండ్రులే లారీ కిందకు తోసేశారు.
తల్లిదండ్రులనే మాటకే కళంకం తెచ్చారా దంపతులు. తమలో తాము గొడవపడి.. నాలుగేళ్ల వయసున్న కన్న కొడుకునే లారీ కిందకు తోసేశారు. ఈ దారుణ సంఘటన అనంతపురం కమలానగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
భార్యాభర్తల మధ్య మాటా మాటా వచ్చి, అది కాస్తా తీవ్ర ఘర్షణగా మారింది. దాంతో నాలుగేళ్ల వయసున్న శివశంకర్ అనే తమ కొడుకును లారీ కిందకు తోసేశారు. దాంతో శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. సంసారంలో రేగిన చిన్న గొడవను సర్దుకోలేక.. కన్న కొడుకు ప్రాణాలనే చేతులారా తీసేశారా దంపతులు!