పా‘లేట్‌’పల్లి రిజర్వాయర్‌!

Paleti Reservoir Has Stopped For No Funds - Sakshi

పాలేటిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి నిధుల కరువు

మూడేళ్ల నుంచి పనులకు బ్రేక్‌

నిన్ను నమ్మం బాబూ..అంటున్న కనిగిరి ప్రాంత ప్రజానీకం 

సాక్షి, కనిగిరి (ప్రకాశం): బ్రిటీష్‌ కాలం నుంచి హామీలకే పరిమితమైన పాలేటి రిజర్వాయర్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కనిగిరిలో భూమి పూజ చేసి మోక్షం కలిగించారు. నిధుల కేటాయింపు జరిగినా అప్పటి అధికారులు స్థానిక పాలకుల లోపంతో పనులు క్షేత్రస్థాయిలో ముందడగు వేయలేదు. ఆ తర్వాత 2013 ఏప్రిల్‌ 1న పాలేటిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి అప్పటి తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య భూమి పూజ చేశారు. అప్పటి ప్రభుత్వం రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులు విడుదల చేసి మొదటి విడత పనులు ప్రారంభించినా టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండో విడత నిధుల కేటాయింపు జరగలేదు. సుమారు మూడేళ్లుగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రాజెక్టు వ్యయం పెరిగింది. 15 ఏళ్ల క్రితం రూ.5 కోట్లుకాగా రెండోసారి 2012లో రూ.17.8 కోట్లకు పెరిగింది. 2017లో తిరిగి ప్రతిపాదన పంపించగా ప్రస్తుతం రూ.22.67 కోట్లకు వ్యయం చేరింది. గతంలో శాంక్షన్‌ జరిగిన నిధులే తప్పా చంద్రబాబు హయాంలో కొత్తగా ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు.

రిజర్వాయర్‌ గురించి..
కనిగిరి ప్రాంత ప్రజల చిరకాల వాంఛ పాలేటిపల్లి రిజర్వాయర్‌  
సుమారు 1,500 ఎకరాల ఆయకట్టుతో ప్రాజెక్టు డిజైన్‌ రూపొందించారు 
పాలేరు వాగు నుంచి పందువగండి, ఎన్‌.గొల్లపల్లి మీదుగా పాలేటిపల్లిలోకి నీరు చేరుతాయి 
ఈ రిజర్వాయర్‌ నిర్మాణంతో పీసీపల్లి మండలంలో బట్టుపల్లి, పాలేటిపల్లి, తలకొండపాడు, కనిగిరి  మండలం రాచగుండ్లపాడు, లింగోజిపురం పంచాయతీల్లో (220 ఎకరాల్లో) పారుదల. సాగు, తాగు నీటికి ఉపయోగం.   
ప్రాజెక్టు చెరువు మునకతో కలిపి విస్తీర్ణం 350 ఎకరాలు. కుడికాలువ 10 కిమి, ఎడమకాలువ 4.25 కిమిల పోడవుతో డిజైన్‌ 
ఎడమ కాలువ కింద 510 ఎకరాలు, కుడికాలువ కింద 990 ఎకరాలు ఆయకట్టు

జరగని భూ సేకరణ
రిజర్వాయర్‌కు తొట్టి, అలుగు, తూములు, మునక భూములకు 350 ఎకరాల భూసేకరణ జరిగింది. 
కుడి, ఎడమ కాలువ నిర్మాణాలను సుమారు 87.38 ఎకరాలు భూసేకరణ జరగాలి
87 ఎకరాల భూసేకరణలో 57 ఎకరాలు పట్టా భూమికాగా మిగతాది అసైన్డ్‌ భూమి
11.7 కిలో మీటర్లు పొడవు, సుమారు 2 మీటర్ల వెడల్పులో కాలువ నిర్మాణం  చేపట్టాలి  
మూడేళ్ల నుంచి సర్వేలకే పరిమితం

కలగని మోక్షం 
టీడీపీ ప్రభుత్వం హయాంలో పాలేటిపల్లి రిజర్వార్‌కు పనులు పడకేశాయి. 2014కు ముందు శాంక్షనై నిధుల్లేక ఆగిన హెడ్‌ వర్క్‌ నిర్మాణ పనులు అరకొరకగా 2016లో పూర్తి చేశారు. ఆ తర్వాత 2017లో రీ ఎస్టీమేషన్‌ నిధుల శాంక్షన్‌ చేశారేగానీ కారణాలు ఏమైనా అధికారులు ఎంతమంది మారినా పనులు ముందడగు పడలేదు. సుమారు రూ.7.29 కోట్ల కెనాల్స్‌ పనులకు నేటికీ టెండర్లు పిలవ లేదు. ఫలితంగా మూడేళ్ల నుంచి ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి.

ఆగిన పనులు
రిజర్వాయర్‌కు మంజూరైన రూ.22.67 కోట్లను మూడు దశలుగా ఖర్చు చేయాలి.
ప్రాజెక్టు అలుగులు, కట్ట, తూములు తొట్టి నిర్మాణానికి కొంత, కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి కొంత, మునక భూములకు నష్టపరిహారం చెల్లింపులకు కొన్ని నిధులు కేటాయించారు.
తొట్టిమునక భూములకు నష్టరిహారం చెల్లింపులు రూ.1.88 కోట్లు చెల్లించారు.
తొట్టి, తూము, కట్టలు, అలుగుకు రూ.8 కోట్ల పనులు జరిగాయి.
మిగతా రూ.12 (పెరిగిన వ్యయం) కోట్లతో కుడి, ఎడమ కాలువలు పనులు జరగాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top