ముగిసిన పైడితల్లి సిరిమానోత్సవం | Paiditalli sirimanotsavam culminates peacefully | Sakshi
Sakshi News home page

ముగిసిన పైడితల్లి సిరిమానోత్సవం

Oct 22 2013 5:55 PM | Updated on Aug 11 2018 9:10 PM

ముగిసిన పైడితల్లి సిరిమానోత్సవం - Sakshi

ముగిసిన పైడితల్లి సిరిమానోత్సవం

ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పైడితల్లి సిరిమానోత్సవం ప్రశాంతంగా ముగిసింది.

విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే  పైడితల్లి సిరిమానోత్సవం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉత్సవం సందర్భంగా తొలిసారిగా కేంద్ర బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దింపారు. 144 సెక్షన్ విధించారు. భారీ భద్రత మధ్య పైడితల్లి సిరిమానోత్సవం నిర్వహించారు.

ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో భక్తుల సంఖ్య బాగా తగ్గింది. ఈ ఉత్సవానికి  పూసపాటి రాజవంశానికి చెందిన అశోకగజపతిరాజు హాజరయ్యారు.  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.  జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement