ఉల్లి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి: జేసీ | Onion illegal transportation of special attention: j c | Sakshi
Sakshi News home page

ఉల్లి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి: జేసీ

Sep 6 2013 4:06 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఉల్లి, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు జేసీ కె.కన్నబాబు తగిన ఆదేశాలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దళారులను ఏర్పాటు చేసుకుని తక్కువ ధరలకే ఉల్లి కొనుగోలు చేసి తరలిస్తున్నారన్నారు.

 కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్:
 ఉల్లి, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు జేసీ కె.కన్నబాబు తగిన ఆదేశాలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దళారులను ఏర్పాటు చేసుకుని  తక్కువ ధరలకే ఉల్లి కొనుగోలు చేసి తరలిస్తున్నారన్నారు. దీంతో జిల్లాలో కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో జేసీ గురువారం తన చాంబరులో మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు, ఏడీ వెంకటేశ్వరరెడ్డితో సమావేశమై పలు ఆదేశాలు ఇచ్చారు. ఉల్లి, ఇతర పంటలను ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకోవాలనుకునే రైతులు సంబంధిత మండల తహశీల్దారు ద్వారా సరుకు తనదేనని ధ్రువీకరించాలి.
 
  ఆ  పత్రాన్ని మార్కెట్ కమిటీ చెక్‌పోస్టుల్లో విధిగా చూపే విధంగా చూడాలని జేసీ సూచించారు. ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌ల చట్టం 1966లో సెక్షన్ 7(6) ప్రకారం మార్కెట్ యార్డులో నిబంధనల మేరకు కొనిన ఉల్లిని మాత్రమే వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అనుమతించాలని సూచించారు. మార్కెట్లతో సంబంధం లేకుండా నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని తరలిస్తే చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement