కత్తులతో దాడి.. ఒక వ్యక్తి మృతి | One person killed in the attack with knives | Sakshi
Sakshi News home page

కత్తులతో దాడి.. ఒక వ్యక్తి మృతి

Nov 22 2015 10:29 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మంచికలపూడి రైల్వే గేటు సమీపంలో ఆదివారం ఉదయం దుండగులు ఓ రౌడీ షీటర్‌ను వేటాడి కత్తులతో నరికారు.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మంచికలపూడి రైల్వే గేటు సమీపంలో ఆదివారం ఉదయం దుండగులు ఓ రౌడీ షీటర్‌ను వేటాడి కత్తులతో నరికారు. ఈ ఘటనలో తెనాలి పట్టణానికి చెందిన వేమూరి సత్యం తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఇతడు పలు హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. గోపి అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాత కక్షలే హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement