పెద్దపంజని మండలం రాయలపేట గ్రామం వద్ద బస్సు, ఆటో ఢీకొన్నాయి.
పెద్దపంజని(చిత్తూరు జిల్లా): పెద్దపంజని మండలం రాయలపేట గ్రామం వద్ద బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాదం సమయంలో ఆటో రాయలపేట నుంచి పలమనేరు వెళ్తుండగా.. బస్సు పలమనేరు నుంచి చౌడేపల్లి వెళ్తోంది. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.