కారు ఢీ : ఒకరు మృతి | One dies and Two injured in road accident | Sakshi
Sakshi News home page

కారు ఢీ : ఒకరు మృతి

Oct 23 2015 6:23 PM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.

ఉయ్యూరు (కృష్ణా జిల్లా) : వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఒక మహిళ మృతిచెందగా.. కారు అదుపుతప్పి వెనుక వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో శుక్రవారం జరిగింది.

గ్రామానికి చెందిన నరసింహులు(59), జయలక్ష్మి(54) బైక్ పై వెళ్తుండగా.. ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జయలక్ష్మి(54) అక్కడికక్కడే మృతిచెందగా.. నరసింహులుతో పాటు వెనక మరో బైక్ పై ఉన్న అబ్డుల్ జబ్బార్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement