వేగంగా వెళ్తున్న కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.
అలమూరు: వేగంగా వెళ్తున్న కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అలమూరు మండలం మూలస్థానం అగ్రహారం వద్ద జరిగింది. వివరాలు..కొత్తపేట మండలం గంటికి గ్రామానికి చెందిన మినపపప్పు వ్యాపారి సైకిల్‌పై వెళ్తున్నాడు. ఇదే సమయంలో జాతీయరహదారి-16పై వేగంగా వెళ్తున్న కారు అతనిని ఢీ కొట్టింది. దీంతో అతను డివైడరు పై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(అలమూరు)