వైఎస్సార్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.
సిద్ధవటం: వైఎస్సార్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. సిద్ధవటం మండలం చాముండేశ్వరీపేట సమీపంలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో పార్వతీపురం గ్రామశివార్లలో ఉన్న పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కుర్రా శివకుమార్(30) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. శివకుమార్ తన బైక్‌పై మధ్యాహ్నాం భోజనానికి భాకరాపేటలోని తన ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యువకుడి మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు ప్రొద్దుటూరు డిపోకు చెందినదిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.