బోల్తాపడ్డ స్కూలు బస్సు.. చిన్నారి మృతి | One Child Dead in School Bus Accident | Sakshi
Sakshi News home page

బోల్తాపడ్డ స్కూలు బస్సు.. చిన్నారి మృతి

Dec 9 2015 6:51 PM | Updated on Sep 3 2017 1:44 PM

పాలకొల్లు పట్టణంలోని బ్రాడీపేట బైపాస్ రోడ్డు వద్ద ఓ స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘనటలో ఐదేళ్ల చిన్నారి మృతి.

పాలకొల్లు పట్టణంలోని బ్రాడీపేట బైపాస్ రోడ్డు వద్ద ఓ స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదానికి గురైన బస్సు సన్‌షైన్ స్కూల్‌కి చెందినదిగా గుర్తించారు. ఈ ఘటనలో పెద్దేవారిపేట గ్రామానికి చెందిన ఎన్. రిషిత(5) అనే యూకేజీ విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది. మరో పది మంది చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement