ప్చ్..50 శాతం బాగాలేవ్! | On the quality of seeds pout | Sakshi
Sakshi News home page

ప్చ్..50 శాతం బాగాలేవ్!

May 24 2016 3:34 AM | Updated on Sep 4 2017 12:46 AM

ప్రభుత్వం సబ్సిడీతో పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తనాలు 50 శాతమే బాగున్నాయ ని, మరో 50 శాతం బాగా ....

వేరుశనగ కాయలు ఒలిచి పరిశీలించిన ఎమ్మెల్యే
విత్తనాల నాణ్యతపై  పెదవి విరుపు
నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలని ఆదేశం

 

బీఎన్‌ఆర్ పేట (చిత్తూరు రూరల్) : ప్రభుత్వం సబ్సిడీతో పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తనాలు 50 శాతమే బాగున్నాయ ని, మరో 50 శాతం బాగా లేవని చిత్తూ రు ఎమ్మెల్యే సత్యప్రభ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు మండలంలోని బీఎన్‌ఆర్ పేటలో సబ్బిడీ విత్తనాల పంపిణీని ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్ పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే పంపిణీకి ఉంచిన కాయలను ఒలిచి, గింజల నాణ్యతను పరిశీలించారు. వాటి ని వేదికపై ఉన్న సింగిల్‌విండో అధ్యక్షుడు రంగనాథంకు చూపారు. వ్యవసా య అధికారులతో చర్చించి నాణ్యత కలి గిన విత్తనాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాయితీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రైతులకు వ్యవసాయపరంగా ఏ సహా యం కావాలన్నా ప్రభుత్వం చేస్తోందని పేర్కొన్నారు. జె డ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ, రైతుల శ్రే యస్సు కు ఉద్దేశించిన పథకాల ప్రయోజనాలు అర్హులకు అందేలా చూడాలని వ్యవసా య అధికారులకు ఆమె సూచించారు.

 
1.36 లక్షల హెక్టార్లలో వేరుశనగ

వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ మాట్లాడుతూ, జిల్లాలో వేరుశనగ పంట గత ఏడాది 1.14 లక్ష హెక్టార్లలో సాగు కాగా ఈ ఏడాది 1.36 లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. వేరుశనగ పంట సాగు విస్తీర్ణాన్ని పెం చేందుకు ప్రభుత్వం రాయితీతో విత్తనాలను అందజేస్తోందన్నారు. ఇందుకు  జి ల్లాకు 90 వేల క్వింటాళ్లు కావాల్సి ఉం డగా తొలి విడతగా 50 వేల క్వింటాళ్లు వచ్చాయన్నారు. వీటితోపాటు రాయితీ తో కందులు, జనుము, జిప్సంను కూ డా ప్రభుత్వం ఇస్తోందన్నారు. వేరుశనగ బ స్తా ధర రూ. 2250 ఉంటే రాయితీతో రూ.1500 ఇస్తున్నామన్నారు. కార్యక్రమం లో  జెడ్పీ సీఈవో పెంచల కిషోర్, ఆర్డీవో కోదండరాామిరెడ్డి, మండల వ్య వసాయశాఖాధికారి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసన్, ఏడీ రమేష్, సర్పంచ్ శోభా, పంచాయతీ కార్యదర్శి చిరంజీవి,  టీడీపీ నాయకులు చంద్రప్రకాష్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

 
గుడిపాలలో..

గుడిపాల: మండలంలోని నరహరిపేట జెడ్పీ హైస్కూల్ ఆవరణలో సోమవారం వేరుశనగ విత్తనకాయలను ఎమ్మెల్యే సత్యప్రభ పంపిణీ చేసి మాట్లాడారు. వ్యవసాయాధికారి హిమబిందు మాట్లాడుతూ, మండలానికి 810 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల అవసరం ఉందని, ఇప్పటివరకు  585 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయన్నారు. అలాగే 4క్వింటాళ్ల కందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నా రు. తహశీల్దార్ బెన్నురాజ్, ఎంపీడీవో మల్లికార్జున్, ఎంపీపీ దీపశ్రీ, జెడ్పీటీసీ సభ్యురాలు సుమతి, సింగిల్‌విండో అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయుడు, ఏఈలు దుర్గాప్రసాద్, సయ్యద్‌పీరా, బాలాజి, మహేష్‌బాబు, వైస్ ఎంపీపీ వేలాంగణి, టీడీపీ నాయకులు బాలాజి, నాగరాజ యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


వేరుశనగ కాయలకు జిప్సం మెలిక
వేరుశనగ కాయలు తీసుకునే రైతులు కచ్చితంగా జిప్సం తీసుకోవాలని ప్రభుత్వం మెలిక పెట్టడంతో రైతులు విధిలేక తీసుకుంటున్నారు. ఎకరా పొలానికి 200 కేజీల జిప్సం తీసుకుంటేనే విత్తన కాయలు ఇస్తున్నారు. 200కేజీల జిప్సంకు అదనంగా రూ.340 రైతులు చెల్లిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement