రాజమండ్రి రూరల్ పాలమూరు గ్రామంవద్ద మంగళవారం ఉదయం ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
రాజమండ్రి : రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా దగ్థమైంది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ తీయడం వల్లే మంటలు చెలరేగయని తెలుస్తోంది. ట్యాంకర్ డ్రైవర్ వెంటనే అప్రమత్తం అవ్వడంతో ఘోర ప్రమాదం తప్పింది.
మంటలను గుర్తించిన వెంటనే డ్రైవర్ వాహనాన్నిరోడ్డు పక్కన ఆపి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.