ఎన్నాళ్లకెన్నాళ్లకు | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు

Published Wed, Oct 25 2017 8:54 AM

notifications for ration shops

సాక్షి, కడప : రేషన్‌ షాపు వ్యవహారాలకు సం బంధించి చాలా రోజుల తర్వాత మంచి అవకాశం లభించింది. 2015కు ముందు డీలర్ల ప్రక్రియను పూర్తి చేసినా తర్వాత అవకాశం రాలేదు. మళ్లీ ఇప్పుడు అవకాశం వచ్చింది. కడప రెవెన్యూ డివిజన్‌ పరిధిలో సుమారు 275 రేషన్‌ షాపులకు నో టిఫికేషన్‌ వెలువడింది. అందుకు సంబం ధించి నవంబరు 3లోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వూ్య ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. చాలా రోజులుగా రేషన్‌షాపుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు అవకాశం లభించనుంది.

2015 తర్వాత.. ఇప్పుడు..
2015లో ఒకసారి రేషన్‌షాపు డీలర్ల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అ యితే దరఖాస్తుదారులకు సంబంధిం చి పరీక్ష అనంతరం కొంత మంది కోర్టుకు వెళ్లడంతో.. అప్పట్లో కో ర్టు నోటిఫికేషన్‌ను రద్దు చేసిం ది. తర్వాత 2016లో నోటిఫికేషన్‌ ఇచ్చినా మళ్లీ కొంత మం ది రోస్టర్‌ విధానంపై కోర్టుకు వెళ్లడంతో అప్పట్లో స్టే విధించింది. రోస్టర్, రిజర్వేషన్‌ విధానాన్ని సరిదిద్దిన అనంతరం మళ్లీ ఇప్పుడు తాజాగా నోటిఫికేషన్‌కు అవకాశం ఉండడంతో.. ప్రస్తుతం రేషన్‌ డీలర్ల నియామకానికి రెవెన్యూశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

275 రేషన్‌ డీలర్ల నియామకానికి చర్యలు
కడప రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కడపలో 36, చక్రాయపేటలో 20, చెన్నూరు 10, చిన్నమండెం 18, చింతకొమ్మదిన్నె 12, గాలివీడు 19, కమలాపురం 10, ఖాజీపేట 8, లక్కిరెడ్డిపల్లె 7, పెండ్లిమర్రి 9, రామాపురం 15, రాయచోటి 23, సంబేపల్లె 8, టి.సుండుపల్లె 15, వల్లూరు 15, వీరబల్లి 15, వీఎన్‌ పల్లె 9, ఎర్రగుంట్ల మండలంలో 29 మంది డీలర్ల నియామకం చేపట్టనున్నారు. పై మండలాల్లో మొత్తం 275 మంది రేషన్‌ డీలర్ల నియామకానికి అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
కడప రెవెన్యూ డివిజన్‌ పరిధిలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కడప ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించి నవంబరు 3వ తేది వరకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 18 మండలాల్లో 275 రేషన్‌ డీలర్లకు సంబంధించి జీఓ నంబర్‌ 4 మేరకు... రోస్టర్, రిజర్వేషన్‌ ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేశామని వివరించారు. కోర్టు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రోస్టర్‌ రిజర్వేషన్‌ ప్రకారం నియామకాలు చేపడుతున్నామని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

రేషన్‌ డీలర్లకు అర్హతలివే
కడప రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రేషన్‌ డీలర్లుగా దరఖాస్తు చేసుకునే వారు ఈ కింది అర్హత కలిగి ఉండాలి. పదో తరగతి కచ్చితంగా ఉత్తీర్ణత కావడంతోపాటు వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నవంబరు 3వ తేది సాయంత్రంలోపు దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేయాలి. రాత పరీక్ష 80 మార్కులకు, ఇంటర్వూ్య 20 మార్కులుకు ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలియజేశారు.

Advertisement
Advertisement