ఏపీ హైకోర్టు ఏర్పాటు నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధం

Notification Set For Separate High Court In Andhra Pradesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటుపై నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. వారం రోజుల్లోగా నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ సిద్ధం చేసిన కేంద్ర న్యాయశాఖ అందు లో మార్పులు, చేర్పులు చేసి తుది నోటిఫికేషన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నోటిఫికేషన్‌కు ప్ర«ధాని మోదీ ఆమోదముద్ర వేశారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 31(2) ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఏపీ హైకోర్టు ఏర్పాటయ్యే తేదీని (అపాయింటెండ్‌ డే) అందులో పొందుపరుస్తారు. ఏపీ హైకోర్టు ఏర్పా టయ్యే ప్రాంతాన్ని కూడా నోటిఫై చేస్తారు. నోటిఫి కేషన్‌ జారీ అయిన తేదీ నుంచి 3 నెలల్లోపు హైకోర్టు ను తరలించాల్సి ఉంటుంది. ఈ గడువును పెంచాల ని కోరే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.

హైకోర్టు విభజనపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2019 జనవరి 1 నాటికి కేంద్రం విభజన నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.  ఏపీ ప్రభుత్వం డిసెంబర్‌ 15 నాటికి హైకోర్టు భవనం సిద్ధమవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపిన విష యం తెలిసిందే. నేలపాడులో నిర్మిస్తున్న హైకోర్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. డిసెంబర్‌ 15 నాటికి భవనం పూర్తవుతుందని చెప్పిన ప్రభు త్వం, ఇప్పుడు డిసెంబర్‌ 31 నాటికి భవనం సిద్ధమ వుతుందని చెబుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల బట్టి చూస్తే నెలాఖరుకు భవనం సిద్ధమయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో తరలింపు ఎప్పుడన్న ప్రశ్న తలెత్తుతోంది. ‘నోటిఫికేషన్‌ వెలువడటం అన్నదే ముఖ్యం. కేంద్రం నిర్ణయించిన విధంగా ఈ వారంలో నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. ఇదే సమయంలో హైకోర్టు తరలిం పునకు 90 రోజుల గడువు ఎలానూ ఉంది. కాబట్టి ఈ వారం రోజుల్లోపు నోటిఫికేషన్‌ వచ్చినా, రాబోయే 3 నెల ల్లోపు ఎప్పుడైనా అమరావతికి హైకోర్టును తర లించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆలోచన తోనే ఉంది’’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హైకోర్టు విభజనకు వీలుగా న్యాయమూర్తుల విభజన కూడా పూరై్తన విషయం తెలిసిందే.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top