పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేసే ప్రసక్తే లేదని పురపాలక మంత్రి మహీధర్‌రెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి మహీధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేసే ప్రసక్తే లేదని పురపాలక మంత్రి మహీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. వడ్డీ మాఫీ వల్ల మునిసిపాలిటీల ఆదాయం తగ్గుతుందని అన్నారు. బకాయిలపై వడ్డీని రద్దు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ప్రభుత్వానికి లే ఖ రాసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల కమిషనర్లతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి వడ్డీ మాఫీ అంశాన్ని స్పష్టం చేశారు. ఆస్తి పన్ను వసూళ్లు ఇంకా యాభై శాతం లోపే ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వంద శాతం ఆస్తిపన్ను వసూళ్లు సాధించాలని కమిషనర్లను ఆదేశించారు. పీడీ అకౌంట్లలో నిధులు ఉన్నా విద్యుత్ చార్జీలు చెల్లించని కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.