‘అమ్మహస్తం’..అస్తవ్యస్తం | Nine types of essential commodities for distribution to the poor | Sakshi
Sakshi News home page

‘అమ్మహస్తం’..అస్తవ్యస్తం

Oct 14 2013 2:51 AM | Updated on Oct 8 2018 5:04 PM

పేదలకు రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చే స్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం..వాటిని పూర్తిస్థాయిలో పం పిణీ చేయడంలో విఫలమైంది.

మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: పేదలకు రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చే స్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం..వాటిని పూర్తిస్థాయిలో పం పిణీ చేయడంలో విఫలమైంది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అన్ని సరుకులను పంపిణీ చేయలేకపోయారు. మూడునెలల పాటు ప్రభుత్వం ప్రకటించిన తొ మ్మిది సరుకుల్లో సగం పంపిణీ కాలేదు. తొమ్మిది సరుకుల్లో అప్పుడప్పుడు గో ధుమలు, చక్కెర, చింతపండు మాత్రమే పంపిణీ చేసి మిగతా వాటిగురించి పట్టించుకోవడం లేదు. వచ్చిన అరకొర వస్తువులు కూడా నాణ్యత లేకపోవడం తో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తిచూపడం లేదు.

కొందరు లబ్ధిదారులు విధిలేని పరిస్థితుల్లో నాసిరకమైన వస్తువులనే కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ చెల్లించే ధరకే బయటమార్కెట్లో నాణ్యమైన సరుకులు వస్తున్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నా రు. అమ్మహస్తం పథకం అమలుచేసిన నాటి నుంచి లబ్ధిదారులకు అందాల్సిన కిరోసిన్, గోధుమలు, చక్కెరకోటాను పూర్తిగా తగ్గించారు. అమ్మహస్తం ద్వారా కంటే గతంలో పంపిణీచేసిన సరుకులే నాణ్యతగా ఉండేవని లబ్ధిదారులు పే ర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పామోలిన్ ఆయిల్‌ను తగ్గించి..కేవలం పట్టణప్రాంతాల్లో మాత్రమే ఇస్తున్నారు. నూనె, బియ్యం ఉంటే చెక్కర, కంది పప్పు రాదు. ఇక గోధుమ పిండి ప్యాకెట్‌లో 200 గ్రాముల వరకు పొట్టు కలిసి వస్తోందని లబ్ధిదారులు పెదవివిరుస్తున్నారు.
 
 సబ్సిడీ ఇలా..
 ‘అమ్మహస్తం’ ద్వారా లబ్ధిదారులు పెద్దఎత్తున లబ్ధిపొందుతారంటూ ప్రభుత్వం ఊదరగొట్టింది. తొమ్మిది సరుకులకు ఒక్కో లబ్ధిదారుడిపై ప్రభుత్వం నెలసరి భరించే సబ్సిడీ రూ.7.78 మాత్రమే. సరుకుల వారీగా ఉప్పుపై 0.91 పైసలు, కారంపొడిపై రూ. 3.75, చింతపండుపై రూ.4.25 (మొత్తం కలిపి రూ. 8.91) సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. అయితే పసుపుపొడి మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేసిన ధర కంటే అదనంగా రూ.1.13ను లబ్ధిదారుపై భారంమోపి వసూలుచేస్తున్నారు. పసుపును మినహాయిస్తే ఒక్కోలబ్ధిదారుపై ప్రభుత్వం కేవలం రూ.7.78 మాత్రమే సబ్సిడీ అందజేస్తోంది.
 
 ఈ విషయాన్ని బయటకు తెలియనీయకుండా అధికార పార్టీ నేతలు కేవలం ప్రచారానికే పరిమితమై లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. అమ్మహస్తం సరుకుల పంపిణీ ప్రక్రియ తలనొప్పిగా మారడంతో చాలామంది డీలర్లు డీడీలు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో తహశీల్దార్లు ఒత్తిడిచేసి డీడీలు కట్టించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 9 సరుకులు విక్రయిస్తే డీలర్‌కు వచ్చే కమీషన్ రూ.4.09 మాత్రమే వస్తుంది. వచ్చిన కమీషన్ మొత్తం సరుకుల దిగుమతి ఖర్చు, ఇతర ఖర్చులు పరిశీలిస్తే ఇంకా తమ చేతినుంచే డబ్బులు ఖర్చవుతోందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అమ్మహస్తం పథకం ద్వారా నాణ్యవంతమైన సరుకులను పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement