వడదెబ్బకు తొమ్మిది మంది మృతి | Nine people died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు తొమ్మిది మంది మృతి

May 15 2014 11:40 PM | Updated on Oct 20 2018 6:04 PM

చినగంజాం మండలం కొత్తపాలెం పంచాయతీ భాగ్యనగర్‌లో కుంచాల వెంకటేశ్వర్లు(59) వడదెబ్బకు గురై మృతి చెందాడు.

 సాక్షి నెట్‌వర్‌‌క: వడదెబ్బకు గురై ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో తొమ్మిది మంది మృతిచెందారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామానికి చెందిన కాలగంధ చెంచమ్మ(70), దగదర్తి మండలం పెదపుత్తేడులో మేకల చెంచయ్య(75), సంగం దళితవాడలో దాసరి మహేశ్వరరావు(35), నాయుడుపేటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(35), అనుమసముద్రంపేట మండలం కొండమీదకొండూరులో ఉక్కాల పెంచలయ్య (48), గుడిపాడు గ్రామంలో సిద్ధారెడ్డి సుదర్శమ్మ వడదెబ్బకు గురై మృతిచెందారు. కాగా, ప్రకాశం జిల్లా చినగంజాం రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి(35) అపస్మారక స్థితిలో పడి ఉండటంతో స్థానికులు అతనికి తాగునీరిచ్చి ఆదుకునే ప్రయత్నం చేశారు. అతను కొద్దిసేపటికి మృతి చెందాడు. చినగంజాం మండలం కొత్తపాలెం పంచాయతీ భాగ్యనగర్‌లో కుంచాల వెంకటేశ్వర్లు(59) వడదెబ్బకు గురై మృతి చెందాడు. టంగుటూరు పోతుల చెంచయ్య(ఈస్ట్)కాలనీకి చెందిన ముత్యాలమ్మ(63) వడదెబ్బకు గురై మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement