'చేనేతను ఆదుకుంటాం' | nimmala statement to chenetha workers | Sakshi
Sakshi News home page

'చేనేతను ఆదుకుంటాం'

Jul 8 2015 6:11 PM | Updated on Sep 3 2017 5:08 AM

'చేనేతను ఆదుకుంటాం'

'చేనేతను ఆదుకుంటాం'

చితికిపోయిన చేనేతను అన్ని విధాలా ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప హామీ ఇచ్చారు.

విశాఖపట్టణం: చితికిపోయిన చేనేతను అన్ని విధాలా ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా కసింకోటలోని చేనేత కార్మికుల స్థితిగతులను పరిశీలించేందుకు ఆయన బుధవారం ఇక్కడికి వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు రూ.3 లక్షల రూపాయలతో వర్కింగ్ షెడ్డు, ఇల్లు నిర్మించి ఇస్తామని, 400 కోట్లతో జనతా వస్త్రాల పథకం అమలు చేస్తామని చెప్పారు. అలాగే చేనేతలు తీసుకున్న రూ.169 కోట్ల వ్యక్తిగత రుణాలను రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిలో సెక్షన్-8 అమలు చేయించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement