మగ్గం.. చిద్విలాసం.. కష్టకాలంలో ఆదుకున్న సీఎం వైఎస్‌ జగన్‌  | Sakshi
Sakshi News home page

‘నేతన్న నేస్తం’తో మెరుగైన బతుకు చిత్రం.. మూడేళ్లలో రూ.576.05 కోట్లు పంపిణీ 

Published Sun, Aug 7 2022 8:50 AM

YSR Nethanna Nestham Scheme Changed Many Peoples Life In AP - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెడనకు చెందిన వి.అక్కనాగమ్మ టీడీపీ మాజీ కౌన్సిలర్‌. చేనేత మగ్గం పనితో కుటుంబానికి బాసటగా నిలుస్తోంది. సంక్షేమ పథకాలు అందించడంలో పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నట్టుగానే టీడీపీకి చెందిన ఆమెకు కూడా ఏడాదికి రూ.24 వేలు చొప్పున నేతన్న నేస్తం అందించారు. గత మూడేళ్లలో వచ్చిన రూ.72 వేలతో.. గతంలో చేసిన అప్పులు తీర్చడంతోపాటు చేనేతకు అవసరమైన ముడి సరుకులు కొనుగోలు చేసింది.

ఇలా ఒక్క అక్కనాగమ్మ మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సగటున 85 వేలకు పైగా చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున ప్రభుత్వం నేతన్న నేస్తం అందిస్తోంది. ఫలితంగా చేనేత రంగం సంక్షేమ రంగులు అద్దుకుంటోంది. నేత కార్మికులు నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు.

నేత కార్మికులకు భరోసా ఇలా..  
► నేతన్న నేస్తంతోపాటు నవరత్నాల పథకాలు చేనేత రంగంపై ఆధారపడిన వారికి ఊపిరి పోశాయి. ఈ మూడేళ్లలో దాదాపు రూ.576.05 కోట్లు నేతన్న నేస్తం కింద పంపిణీ చేశారు.  
► కరోనా సమయంలో చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాల నిల్వలను ఆప్కో ద్వారా సేకరించి విక్రయించారు. చేనేతకు కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తూ ఆర్గానిక్‌ వ్రస్తాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి వినూత్న ప్రయోగాలతో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 
► మూడేళ్లలో దాదాపు 40 ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ, క్లస్టర్‌ ట్రైనింగ్‌ ఇచ్చారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడీ అందించి మగ్గాలు, షెడ్డులు, తదితర సామగ్రిని సమకూర్చారు. మిల్లు వ్రస్తాలకు దీటుగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ కల్పిస్తూ.. ఆప్కో షోరూమ్‌లను విస్తరించి సొసైటీల వద్ద వస్త్రాలు కొనుగోలు చేసి విక్రయించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. 
► రెడీమేడ్‌ వ్రస్తాలను కూడా తయారు చేయడంతో చేనేత డిజైన్లకు ఆదరణ పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లోనూ, ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ వీటిని విక్రయిస్తున్నారు.

రాజకీయంగానూ అందలం
చంద్రబాబు మోసం చేస్తే, జగన్‌ చేనేతలను ఆదుకున్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కారి్మకుడికి అండగా నిలిచారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కారి్మకుల కుటుంబాలకు రూ.3.52 కోట్లు చెల్లించారు. ఇద్దరికి ఎమ్మెల్సీ, ఒకరికి ఎంపీ, ఏడుగురికి మున్సిపల్‌ చైర్మన్‌లు, ఇద్దరికి టీటీడీ బోర్డు మెంబర్‌.. పద్మశాలి, తొగట, దేవాంగ, కరి్ణశాలి కార్పొరేషన్‌ చైర్మన్లు, 48 మందికి డైరెక్టర్ల పదవులు ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా ఎంతోమందికి అవకాశమిచ్చారు.  
– మోహనరావు, ఆప్కో చైర్మన్‌
చదవండి: పారిశ్రామికవేత్తలుగా పొదుపు మహిళలు 

Advertisement
Advertisement